వైద్య శ్రీ బోల్ల సుధాకర్ గారు

మూలికా పరిశోధకులు | ఆయుర్వేద నిపుణులు | ఆయుర్వేద ఔషధ మొక్కల పాఠశాల స్థాపకులు

వైద్య శ్రీ బోల్ల సుధాకర్ గారు భారతీయ సంప్రదాయ వైద్యశాస్త్రమైన ఆయుర్వేదం పట్ల అపారమైన ఆసక్తితో, గత అనేక సంవత్సరాలుగా మూలికా పరిశోధన మరియు ఆయుర్వేద మొక్కల వైద్య గుణాలపై సుదీర్ఘ అధ్యయనం చేస్తున్నారు. ఆయ‌న జీవిత లక్ష్యం – నాటి పూర్వికులు మనకు అందించిన ఔషధ సంపదను రక్షిస్తూ, మానవాళికి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడమే.

మూలికలపై అంకితభావంతో పరిశోధన

బోల్ల సుధాకర్ గారు నదికొండ, అరణ్యప్రాంతాలు, అడవులు వంటి వివిధ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరిగే ఆయుర్వేద ఔషధ మొక్కలను గుర్తించటం, వాటిపై ప్రయోగాలు చేయటం, వాటి ఔషధ గుణాలు పరిశీలించటం లో అత్యంత నిష్టతో కొనసాగుతున్నారు.

వీరు పరిశోధించిన కొన్ని ప్రముఖ మూలికలు:

TOP